సంక్రాంతి పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ నిలువు దోపిడీ..
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరుతున్న వేళ, ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీకి తెగబడుతోంది. బస్సు లు దొరకడం లేదు, దొరికినా ఆకాశాన్ని
ప్రైవేట్ ట్రావెల్స్


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)

సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరుతున్న వేళ, ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీకి తెగబడుతోంది. బస్సు లు దొరకడం లేదు, దొరికినా ఆకాశాన్ని తాకే చార్జీలతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు సంక్రాంతి ట్రాఫిక్ పీక్కు చేరుకుంది. రైళ్లలో బెర్తులు దొరకడం లేదు. ఏ ట్రైన్ కోసం ట్రై చేసినా రిగ్రెట్ అనే వస్తుంది. స్లీపర్, ఏ సీ, థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్... ఇలా అన్ని బెర్తులు నిండిపోయాయి. పోనీ బస్సులైనా ఎక్కుదామా అంటే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినా డిమాండ్కు సరిపోవడం లే దు. ఈ పరిస్థితిని పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కుమ్మక్కై రేట్లను ఇష్టానుసారంగా పెంచేశాయి.

సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు వంటి రూట్లలో ఆఫర్లతో కలుపుకుని ప్రైవేటు బస్సు టికెట్ రూ.600 నుంచి రూ.1200 మధ్య ఉంటుంది. కానీ సంక్రాంతి డిమాండ్ పేరుతో ఇదే టికెట్ను రూ.2,500 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ ఏజెన్సీ లు డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో నాలుగు రెట్లు ధర పెంచాయి. ఆన్లైన్ టికెట్ జారీ చేసే రెడ్ బస్, అభిబస్ వంటి వెబ్సై ట్స్లోనూ స్పష్టంగా పెంచిన రేట్లు దర్శనమి స్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ యాప్స్ లో సీట్లు లేవని చూపించి, అదే బస్సుల్లో ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande