బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయ్‌
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో, గతేడాదిలో మనదేశం నుంచి బియ్యం ఎగుమతులు మళ్లీ భారీగా పెరిగాయి. 2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్
బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయ్‌


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)

ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో, గతేడాదిలో మనదేశం నుంచి బియ్యం ఎగుమతులు మళ్లీ భారీగా పెరిగాయి. 2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. బాస్మతీ యేతర బియ్యం ఎగుమతులు 25% వృద్ధితో 151.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు, బాస్మతీ బియ్యం 8% పెరిగి 64 లక్షల మెట్రిక్‌ టన్నులు తరలి వెళ్లినట్లు వివరించారు. దేశీయంగా దిగుబడులు పెరిగినందునే, బియ్యం ఎగుమతులకు మన ప్రభుత్వం అనుమతించింది. దీంతో థాయిలాండ్, వియత్నాం దేశాల నుంచి బియ్యం ఎగుమతులు తగ్గాయని వెల్లడించారు. 2022లోనూ రికార్డు స్థాయిలో 223 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. తదుపరి దేశీయంగా ధరలు పెరిగినందున, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినా, గతేడాది తొలగించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande