
ప్రకాశం (మార్కాపురం), 11 జనవరి (హి.స.)
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలోవిషాదం చోటుచేసుకుంది. బేస్తవారిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బేస్తవారిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ