
సూర్యాపేట, 11 జనవరి (హి.స.)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడకు వెళ్తున్న వాహనదారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం వాహనాల తనిఖీ సందర్భంగా ప్రయాణికులకు పూలు అందజేస్తూ ‘హ్యాపీ జర్నీ’ అంటూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.
పోలీసుల ఈ ఆత్మీయ చర్యకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు