తెలంగాణ పల్లెల్లో సంక్రాంతి శోభ.. గుట్టుగా కోడిపందాలు
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) తెలంగాణ పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. తెల్లవారు జాము నుండే హరిదాసుల ఇళ్లలోగిల్లకు చేరి ఆట పాటలతో అలరిస్తూ బిక్షాటన చేస్తుండగా గంగిరెద్దులు వాకిల్లలోని రంగవల్లులపై చేరి ఆటలాడుతూ అలరిస్తున్నాయి. సంక్రాంత
తెలంగాణ సంక్రాంతి


హైదరాబాద్, 11 జనవరి (హి.స.) తెలంగాణ పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. తెల్లవారు జాము నుండే హరిదాసుల ఇళ్లలోగిల్లకు చేరి ఆట పాటలతో అలరిస్తూ బిక్షాటన చేస్తుండగా గంగిరెద్దులు వాకిల్లలోని రంగవల్లులపై చేరి ఆటలాడుతూ అలరిస్తున్నాయి.

సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకోని ప్రభుత్వం శనివారం నుండి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు చేరగా కొత్తగా పెళ్లయిన కూతుర్లు అల్లుల్లు ఇళ్లకు చేరుకోవడంతో ప్రతి ఇంట్లో సంక్రాంతి పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఊళ్ళల్లో గుర్తు చప్పుడు కాకుండా చాటుమాటుగా కోడి పందాలు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్ పంటలు ఇళ్లకు చేరడంతో పాటు ధాన్యం అమ్మకాల డబ్బులు రైతుల చేతుల్లోకి రావడంతో ఆయా గ్రామాల్లోని పనులు లేకపోవడంతో సరదాగా సంక్రాంతి కోడి పందాలు ఆడుతూ సరదాలు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande