
అమరావతి, 11 జనవరి పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు. చాలాకాలంగా ట్రాక్‌లను బలోపేతం చేయటంతో పాటూ ఇంటర్ లాకింగ్ పనులు కూడా తరచూ చేపడుతూ వస్తున్నారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దీంతో రైళ్ల ఆలస్యం తగ్గటంతో పాటు వేగం పెరిగింది. ఈ ప్రభావం డివిజన్ పరిధిలోని పలు ముఖ్య మార్గాల్లో నడిచే రైళ్లపై పడింది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ