రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదు.. వెంకయ్య నాయుడు
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంంకయ్య నాయుడు అన్నాారు. ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతిిి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగ
వెంకయ్య నాయుడు


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)

తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంంకయ్య నాయుడు అన్నాారు. ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతిిి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అందువల్లే రాజకీయాల్లోకి తన కుమారుడు, కుమార్తె రానివ్వలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రాదాయాలను కాపాడాలని తన పిల్లలకు చెప్పానని, అదే తాను ఇచ్చే సంపద అని వ్యాఖ్యానించారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మారకూడదని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande