
వనపర్తి, 11 జనవరి (హి.స.)
ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ప్రజలతో కలిసి గ్రామంలోని విధులలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో గ్రామాలలో అభివృద్ధి పనులను చేపట్టి గ్రామ సమగ్రాభివృద్ధికి కృషిచేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి గ్రామానికి కోటి రూపాయలతో మంజూరు చేయడం ద్వారా భవనాలు, రహదారుల నిర్మాణం, త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, వంటి మౌళిక సదుపాయాలను పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు