
హనుమకొండ, 11 జనవరి (హి.స.)
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి మళ్లీ ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ప్రొఫెసర్ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ జిల్లాను మళ్లీ ఏకం చేయాలనే డిమాండ్ న్యాయసమ్మతమని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హనుమకొండ-వరంగల్ జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు