మహిళపై దాడి కేసు... విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, 11 జనవరి (హి.స.)విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న నగర పోలీసుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, కేసును ఛేదించడంలో పోలీస
సీఎం చంద్రబాబు


విశాఖపట్నం, 11 జనవరి (హి.స.)విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న నగర పోలీసుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, కేసును ఛేదించడంలో పోలీసులు చూపిన చొరవ, వృత్తి నైపుణ్యం ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే సమయంలో, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌కు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్ వద్ద విజయదుర్గ అనే మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణం స్పందించిన పోలీసులు, రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎలాంటి బలమైన ఆధారాలు లేనప్పటికీ, తమ నైపుణ్యంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తేలింది.

ఈ పరిణామంపై బాధితురాలు విజయదుర్గ పోలీసుల పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం ఇచ్చిన వెంటనే వారు స్పందించిన తీరు అద్భుతమని చెప్పారు. అనంతరం ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నిందితుడిని చూసి అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని, బదులుగా మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేయడం గమనార్హం.

ఈ మొత్తం ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖలో శాంతిభద్రతలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. మహిళల భద్రత విషయంలో విశాఖ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గుర్తుచేశారు. ప్రజల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande