
టెహ్రాన్, 11 జనవరి (హి.స.)
ఇరాన్‌లో ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఇంటర్నెట్ షట్‌డౌన్, కఠినమైన అణచివేత చర్యలు ఉన్నప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ రోజు ప్రకటనతో ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై యుద్ధం ప్రకటించినట్లయింది.
నిరసనకారులను ఏమాత్రం ఉపేక్షించవద్దని, వారిపై కఠినమైన అభియోగాలు మోపాలని ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ మొవాహెదీ ఆజాద్ ప్రాసిక్యూటర్లను ఆదేశించారు. నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా, వారికి సహాయం చేసే వారిని కూడా 'మొహారెబ్' (దేవుడి శత్రువులు) గా పరిగణిస్తామని, దీనికి ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తూ అణచివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. శాంతియుత నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ట్రంప్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV