ఉద్యోగాల పేరుతో మోసం.. మయన్మార్ చెర నుంచి బయటపడ్డ తెలుగు యువకులు!
విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మోసపూరిత హామీలతో వెళ్లి మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ మాఫియా చెరలో చిక్కుకున్న భారతీయ యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
G


అమరావతి, 11 జనవరి (హి.స.): విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మోసపూరిత హామీలతో వెళ్లి మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ మాఫియా చెరలో చిక్కుకున్న పలువురు భారతీయ యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీసుకున్న వేగవంతమైన చర్యలతో బాధితులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు.

ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు కొంతమంది యువకులను విదేశాలకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అక్రమంగా మయన్మార్ సరిహద్దుల్లోని సైబర్ క్రైమ్ కేంద్రాలకు తరలించారు. గదుల్లో బంధించి శారీరకంగా హింసించడమే కాకుండా, బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు. వారి దుస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఈ విషయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల గోడు విన్న వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు.

వీడియో ద్వారా వేడుకోలు

మయన్మార్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువకులు తమ కష్టాలను వీడియో రూపంలో మంత్రి రామ్మోహన్ నాయుడుకు పంపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande