ప్రభాస్ రాజా సాబ్ జోరు..రూ.200 కోట్లు క్రాస్
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కామెడీ, హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ది రాజా సాబ్ సినిమా రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్ర
రాజా సాబ్


హైదరాబాద్, 13 జనవరి (హి.స.)

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్

మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కామెడీ, హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ది రాజా సాబ్ సినిమా రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు కూడా పడిపోయాయి. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభాస్ పోస్టర్ కూడా వదిలింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ జోడించడంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయట.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande