
ముంబయి/ ఢిల్లీ,13, జనవరి (హి.స.) నియమిత కాల వ్యవధిలో తనిఖీ చేస్తున్నాం కదా అని సరిపెట్టుకోకూడదని.. కార్యకలాపాలపై ఎపుడూ అప్రమత్తంగా ఉండాలని బ్యాంకుల నిర్వాహకులకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ సూచించారు. కార్యకలాపాల విషయంలో బలమైన క్రమశిక్షణ అవసరమని, డేటా పాలన ఏడాదంతా కొనసాగాలని వివరించారు. ‘డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ పర్యవేక్షణలో ఎదురయ్యే సవాళ్ల’పై ఆయన మాట్లాడుతూ ‘దశాబ్దాలుగా బ్యాలెన్స్‌షీట్లు చదవడం, ప్రక్రియలన్నిటినీ తనిఖీ చేయడంపైనే సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పేపరుపై ఒక బ్యాంకు బాగానే కనిపించొచ్చు. అయినా తీవ్ర అనిశ్చితికి లోనవడానికి ఒక్క పరిణామం చాలు. ఎందుకంటే ‘బ్రాంచ్ అండ్ ప్రోడక్ట్’ నుంచి ‘పైప్స్ అండ్ కోడ్’కు బ్యాంకింగ్ ధోరణులు మారాయని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు