మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.
ఢిల్లీ,13, జనవరి (హి.స.)బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్‌ను చైనా రాయబారి యావో వ
మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.


ఢిల్లీ,13, జనవరి (హి.స.)బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్‌ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. యావో వెన్‌తో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లియు యుయిన్, పొలిటికల్ డైరెక్టర్ జాంగ్‌జింగ్‌తో పాటు చైనీస్ అధికారులు ఉన్నారు. ఇరు దేశాల ప్రతనిధులు చైనా, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంశాల గురించి చర్చించారు.

చైనా, బంగ్లాదేశ్ మధ్య చారిత్రాత్మక స్నేహం ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి చాలా ముఖ్యమైందని జమాతే ఇస్లామీ పేర్కొంది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఈ సమావేశం జరగడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది. గత సంవత్సరం విద్యార్థి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించిన యువజన పార్టీ ఎన్‌సిపితో పొత్తు పెట్టుకుని జమాతే ఇస్లామీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇటీవల జగన్నాథ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande