
చెన్నై, 13జనవరి (హి.స.)
: నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ పేరు, ఫొటోను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా ఉపయోగించకూడదని మద్రాసు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. చెన్నైకు చెందిన ‘నీయే విడై’ సంస్థ తన ఫొటో, పేరు, ‘ఉలగనాయగన్’ బిరుదును, ప్రసిద్ధ డైలాగును అనుమతి లేకుండా ఉపయోగించి టీ-షర్టులను, షర్టులను విక్రయిస్తున్నట్లు కమల్‌హాసన్ తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది.
వ్యక్తి హక్కును పరిరక్షించేలా కమల్‌హాసన్ పేరు, ఫొటో, బిరుదులు, డైలాగులను ‘నీయే విడై’ మాత్రమే కాక ఇతర ఏ సంస్థ కూడా అనుమతిలేకుండా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌దారు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాటితో ఏకీభవించిన న్యాయమూర్తి... అనుమతిలేకుండా వాణిజ్యపరంగా కమల్‌హాసన్ పేరు, ఫొటోలను వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ‘నీయే విడై’ సంస్థను ఆదేశించారు.
4.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు