
ఢిల్లీ,13, జనవరి (హి.స.) పశ్చిమ బెంగాల్ సీఎం మమత సహా ఆ రాష్ట్ర డీజీపీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐ-ప్యాక్’ మనీ లాండరింగ్ కేసులో విచారణకు అడ్డుపడుతున్నారని ఈడీ అధికారులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న వారు, పోలీసు అధికారులు.. చట్టబద్ధమైన విచారణలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు