
న్యూఢిల్లీ, 15 జనవరి (హి.స.)
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త
వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అమరికా మద్దతు ఇవ్వడం.. ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఖమేని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అమెరికా 24 గంటల్లో ఇరాన్ పై సైనికచర్యకు దిగేలా పరిస్థితులు కనిపిస్తున్న వేళ ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
బుల్లెట్ ట్రంప్ చెవికి గాయం చేస్తూ దూసుకెళ్లింది. కాగా ఈ సారి గురి తప్పదు అంటూ ఇరాన్ టీవీ ట్రంప్ ఫోటోను ప్రసారం చేసింది. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. ఓవైపు అమెరికా ఏ క్షణం అయినా ఇరాన్ పై దాడి చేయవచ్చు అని వార్తలు వస్తున్న వేళ ఇరాన్ ట్రంప్ కే వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ట్రంప్ పై దాడి జరిగినప్పుడు సైతం ఆ దాడికి ఇరాన్ కారణం అని ప్రకటన చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు