ఇజ్రాయెల్‌లో భారతీయులకు 'హై అలర్ట్': అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కేంద్రం హెచ్చరిక
ఢిల్లీ, 16 జనవరి (హి.స.) పశ్చిమాసియాలో ముప్పు ముంచుకొస్తున్న వేళ భారత్ తన పౌరుల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇజ్రాయెల్‌పై ప్రభావం చూపవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారత పౌరు
ఇజ్రాయెల్‌


ఢిల్లీ, 16 జనవరి (హి.స.)

పశ్చిమాసియాలో ముప్పు ముంచుకొస్తున్న వేళ భారత్ తన పౌరుల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇజ్రాయెల్‌పై ప్రభావం చూపవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) ఈ రోజు శుక్రవారం తాజా అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా విభాగం సూచించే భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం సుమారు 40 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అక్కడ ఉన్నవారు అనవసరంగా బయట తిరగవద్దని ఎంబసీ కోరింది. అమెరికా, బ్రిటన్ దేశాలు కూడా ఇప్పటికే తమ పౌరులకు ఇవే తరహా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande