
కర్నూలు, 05 జనవరి (హి.స.)పాలు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు రోజూ పాలు తాగుతారు. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని చెబుతారు. పాలలో కాల్షీయం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు బలంగా మారడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ అలసటను తగ్గిస్తాయి. ఉదయం లేదా సాయంత్రం పాలు తాగడం మంచిది. అయితే, కొందరు మాత్రం పాలు తాగడం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంపూర్ణ పోషకంగా పరిగణించబడే పాలను రోజూ తాగడం వలన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. పాలలో కాల్షీయం, ప్రోటీన్లు, విటమిన్ డీ, విటమిన్ బీ12, పోటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ప్రయోజనకరం. పాలు తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే, కొంతమంది
కొంతమంది లాక్టోస్ ఎలర్జీ కారణంగా పాలను తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్భంలో వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం. ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు మాత్రం రాత్రిపూట పాలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల పాలలోని కొవ్వు, కేలరీలు శరీరం ద్వారా గ్రహించబడతాయి. దీంతో బరువు పెరుగుతుంది. అందువల్ల, ఇప్పటికే ఊబకాయంతో బాధపడుతున్నవారు రాత్రిపూట పాలు తాగడం మానేయాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV