
ముంబై, 05 జనవరి (హి.స.)గోల్డ్ లవర్స్‌కి సూపర్ గుడ్‌న్యూస్…ఎందుకంటే…సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో పసిడి పరుగులకు కళ్లెం పడినట్టుగా కనిపిస్తోంది. అవును.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టే దిశగా పయనిస్తోంది. మొన్నటి వరకు చుక్కలు చూపించిన పుత్తడి ధరలు నేడు కాస్త ఉరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులు కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. అయితే, గోల్డ్ రేట్స్ తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ పెరగడమే కారణం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇవాళ జనవరి 5వ తేదీ సోమవారం బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,35,810లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,490లుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,860లుగా ట్రేడ్ అవుతోంది.
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,37,450 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,25,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,56,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV