ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి డీలా..
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న రూపాయి విలువ సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో డీలా పడింది. దీంతో ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. ప్రారంభ ట్
రూపాయి డీలా..


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న రూపాయి విలువ సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో డీలా పడింది. దీంతో ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. ప్రారంభ ట్రేడింగ్లో 4 పైసలు నష్టపోయిన రూపాయి, ప్రస్తుతం రూ. 90.24 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, బలపడటం పెట్టుబడిదారుల సెంటిమెంట్ కారణంగా రూపాయి పై ఒత్తిడి పెరిగిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత సెషన్లో ముగింపు స్థాయితో పోలిస్తే ఈ పతనం నమోదైంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande