గోల్డ్ కొనేవారికి హడలెత్తిపోయే న్యూస్.. ఒక్కసారిగా ఉన్నట్లుండి మారిన ధరలు.. ఎంత పెరిగాయో చూడండి..?
ముంబై, 06 జనవరి (హి.స.)గోల్డ్ రేట్లు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా-వెనిజులా వివాదంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత నెలకొంది. దీంతో బంగారంపై పెట్టుబడులు పెరగడంతో వీటి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. మరి
Bullion-market-Gold-Silver


ముంబై, 06 జనవరి (హి.స.)గోల్డ్ రేట్లు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా-వెనిజులా వివాదంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత నెలకొంది. దీంతో బంగారంపై పెట్టుబడులు పెరగడంతో వీటి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా-వెనిజులా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దీని వల్ల పసిడిపై పెట్టుబడులు పెరగడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. సోమవారం నుంచి బంగారం ధరల్లో పెరుగుదల నమోదవుతూ వస్తోంది. నిన్న గోల్డ్ రేట్లు పెరగ్గా.. మంగళవారం కూడా మరికొంత పెరిగాయి.

హైదరాబాద్‌లో సోమవారం ధరలతో పోలిస్తే మంగళవారం తులం బంగారంపై రూ.600 పెరిగింది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,38,820గా కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1.38,220 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు మంగళవారం రూ.1,27,250 వద్ద ట్రేడవుతోంది.

నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ.500 పెరిగింది.ఇక విశాఖపట్నం, విజయవాడలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,970గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,300 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande