ఏపీలోని.అనంతపురం.చిత్తూరు కోర్టులకు బాంబు.బెదిరింపులు
అమరావతి, 08 జనవరి (హి.స.) అనంతపురం, చిత్తూరు: ఏపీలోని అనంతపురం, చిత్తూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టుల్లో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈ-మెయిల్‌ ద్వారా బెద
ఏపీలోని.అనంతపురం.చిత్తూరు కోర్టులకు బాంబు.బెదిరింపులు


అమరావతి, 08 జనవరి (హి.స.)

అనంతపురం, చిత్తూరు: ఏపీలోని అనంతపురం, చిత్తూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టుల్లో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. మెయిల్‌ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande