తుర్కయంజాల్ చౌరస్తాలో బీజేపీ నాయకుల ధర్నా
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) తుర్కయంజాల్ను సర్కిల్గా ప్రకటించి ఎల్బీనగర్ జోన్లో కలపాలని బీజేపీ సాగర్ హైవే తుర్కయంజాల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు నిర్వహించిన ధర్నాతో సాగర్ హైవేపై మూడు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జాం అయిం
బీజేపీ నాయకుల ధర్నా


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

తుర్కయంజాల్ను సర్కిల్గా ప్రకటించి ఎల్బీనగర్ జోన్లో కలపాలని బీజేపీ సాగర్ హైవే తుర్కయంజాల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు నిర్వహించిన ధర్నాతో సాగర్ హైవేపై మూడు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి భారీ ఎత్తున నిరసన తెలుపుతూ ఓల్డ్ సిటీ వద్దురా రంగారెడ్డి ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా బిజెపి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాను ముక్కలుగా చేసి హైదరాబాదులో కలపాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ నీ అస్తవ్యస్తం చేస్తూ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ జోన్లో విలీనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుర్కయంజాల్ ను సర్కిల్ గా ప్రకటించి ఎల్బీనగర్ జోన్ లో కలపాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande