మహిళలకు బెస్ట్ సిటీగా బెంగళూర్. నాలుగవ స్థానంలో హైదరాబాద్
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) భారతదేశంలో మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూర్ నిలిచింది. చెన్నై కేంద్రంగా ఉన్న వర్క్ ప్లేస్ ఇన్ క్లూజన్ సంస్థ అవతార్ (Avtar) నిర్వహించిన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. సామాజిక మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రీయల్ ఇంక్లూషన్ వ
బెస్ట్ సిటీ


హైదరాబాద్, 08 జనవరి (హి.స.) భారతదేశంలో మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూర్ నిలిచింది. చెన్నై కేంద్రంగా ఉన్న వర్క్ ప్లేస్ ఇన్ క్లూజన్ సంస్థ అవతార్ (Avtar) నిర్వహించిన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. సామాజిక మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రీయల్ ఇంక్లూషన్ వంటి వాటి ఆధారంగా దేశంలోని 125 నగరాలు మహిళలకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో అంచనా వేసింది. బెంగళూర్ 53.29 ఇంక్లూషన్ స్కోర్(CIS)తో అగ్రస్థానంలో ఉండగా, చెన్నై(49.86), పూణే(46.27) తర్వాత స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ 46.04తో నాలుగో స్థానంలో ఉండగా, ముంబైన 44.49 ఐదో స్థానంలో నిలిచాయి.

భద్రత, ఆరోగ్య, విద్యా, మొబిలిటీ, జీవన సౌలభ్యం వంటి అంశాలను కొలిచే సామాజిక ఇంక్లూజన్ స్కోరు (SIS), అధికారిక ఉద్యోగ అవకాశాలు, కార్పొరేట్ ఇంక్లూజన్ పద్ధతులు, నైపుణ్యం మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ట్రాక్ చేసే పారిశ్రామిక ఇంక్లూజన్ స్కోరు (IIS) ఆధారంగా ఈ స్కోర్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande