
హైదరాబాద్, 08 జనవరి (హి.స.)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో పక్షులు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం కలిగించే చైనా మాంజా విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందాల వేళ.. అయితే, మన సంతోషం మరోకరి ప్రాణానికి ముప్పుగా పరిణమిoచకూడదని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు