కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్..
తెలంగాణ, 08 జనవరి (హి.స.) కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు బీజేపీనే ఉద్యమ
బండి సంజయ్


తెలంగాణ, 08 జనవరి (హి.స.)

కృష్ణా జలాల పంపకాల విషయంలో

కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు బీజేపీనే ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచిందని తెలిపారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీ కాంగ్రెస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కూడా విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.

నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొలిటికల్ డ్రామాలాడుతున్నాయని గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన పాపాలు.. తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande