
చేవెళ్ల, 08 జనవరి (హి.స.)
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే
ధ్యేయంగా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలం గ్రామాలలో రూ. కోటి 10 లక్షలతో చేపట్టే సిమెంట్ రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు కోసం గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండడం సంతోషకరమని పేర్కొన్నారు. గ్రామాలలో ప్రధానంగా ప్రజలకు కావలసిన సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు అవసరమని ఆ దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు