ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్
జగిత్యాల, 08 జనవరి (హి.స.) రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం–2026 సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ ప
జగిత్యాల కలెక్టర్


జగిత్యాల, 08 జనవరి (హి.స.)

రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం–2026 సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande