
నిజామాబాద్, 08 జనవరి (హి.స.)
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడమే ప్రభుత్వ ద్వేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 100% సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ వద్ద మూడు రకాల చేప పిల్లలు రోహు, కట్ల, మ్రిగాల, రకాలకు చెందిన 48 లక్షల 18 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే చేప పిల్లలను లాంఛనంగా వదిలారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు