సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్పై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతానికి మరో కీలక అడుగు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)
కేటీఆర్ ఆసక్తికర ట్వీట్


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతానికి మరో కీలక అడుగు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలను విస్తరించేందుకు చేపట్టిన మహత్తర ప్రణాళికలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ, హైదరాబాద్లో నాలుగు TIMS ఆసుపత్రుల ఏర్పాటు, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) విస్తరణ, అలాగే వరంగల్లో తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులను గత కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేసి అమలు చేసిందని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande