
ఖమ్మం, 08 జనవరి (హి.స.)
ఖమ్మం నగరంలో ప్రజలు
ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపు పై దృష్టి సారించాలని కోరుతూ బీజేపీ గురువారం ఖమ్మం జిల్లా శాఖ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది. బీజేపీ జిల్లా పార్టీ నాయకులు కమిషనర్ను కలిసి, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. .
నగరంలో హిందూ దేవాలయాల అభివృద్ధిని విస్మరించడం పై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా దేవాలయాలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆవరణలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు మున్సిపల్ నిధులతో రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు