కే త్వరలో బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం: దానం నాగేందర్
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు. కేటీఆర్ కావాలనే రేవంత్ తో కయ
దానం నాగేందర్


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ కు

తీవ్ర నష్టం జరుగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు. కేటీఆర్ కావాలనే రేవంత్ తో కయ్యం పెట్టుకుంటున్నారని, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పోతే కేటీఆర్ కే నష్టమని పేర్కొన్నారు. కేటీఆర్ అహంకార ధోరణి వల్లనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.

దిగజారుడు రాజకీయాలు చేసి.. కేటీఆర్ లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పాలనాపరమైన అంశాలపై మాట్లాడితే.. రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande