
పుణె, 08 జనవరి (హి.స.)
ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్
మాధవ్ గార్గిల్ (83) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పుణెలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు గురువారం వెల్లడించాయి. కాగా, భారత్లోని అత్యంత సున్నితమైన జీవ వైవిధ్య ప్రాంతమైన పశ్చిమ కనుమల పరిరక్షణలో డాక్టర్ గార్గిల్ చేసిన కృషి అపూర్వమైనది.
పర్యావరణ పరిరక్షణ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఐక్యరాజ్యసమితి 20245 ఆయనకు 'ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్' అవార్డును ప్రదానం చేసింది. ఐక్యరాజ్యసమితి అందించే అత్యున్నత పర్యావరణ గౌరవం కావడం విశేషం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు