మున్సి'పోల్స్'కు వడివడిగా అడుగులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ భేటీ
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) తెలంగాణ లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2019 నాటి ఓటరు జాబి
మున్సి'పోల్స్'కు


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

తెలంగాణ లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 'నోటా' (NOTA)ను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో పలు రాజకీయ పార్టీలతో సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ స్థాయిలో అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. జనవరి 10 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande