ఒక్క క్షణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. నిండు ప్రాణం బలి : నారాయణపేట జిల్లా జడ్జ్
నారాయణపేట, 08 జనవరి (హి.స.) ఒక క్షణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. నిండు ప్రాణం బలి అవ్వడమే కాకుండా కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుందని నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆదేశాల ప్రకారం..
జిల్లా జడ్జి


నారాయణపేట, 08 జనవరి (హి.స.)

ఒక క్షణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. నిండు ప్రాణం బలి అవ్వడమే కాకుండా కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుందని నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆదేశాల ప్రకారం.. గురువారం జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో ఆన్ రోడ్ సురక్ష అభియాన్ స్పెషల్ క్యాంపెయిన్ పై జిల్లా కోర్ట్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు నియమాలు మీ ప్రాణాలు కుటుంబాల భవిష్యత్తుని కాపాడేందుకు రూపొందించారని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande