బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలి : సీపీఎం
నాగర్ కర్నూల్, 08 జనవరి (హి.స.) రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తి మాటలు చెప్పటం మాని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకత్వంతో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం రాష్ట్ర
సీపీఎం


నాగర్ కర్నూల్, 08 జనవరి (హి.స.)

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం

రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తి మాటలు చెప్పటం మాని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకత్వంతో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కపట ప్రేమలు నిలిపివేసి వారికి రాజ్యాంగం ప్రకారం.. రావాల్సిన హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు ఆయన సతీమణి అమెరికా అధ్యక్షుడు అరెస్టు చేస్తే దేశ ప్రధాని మోదీ ఆ ఘటనపై నోరు మెదకపోవడాన్ని విమర్శిస్తూ.. సంఘటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande