
అనంతపురం, 08 జనవరి (హి.స.)
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. రాయలసీమకు పౌరుషం లేదని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఎక్కడపడితే అక్కడ ఏదిపడితే అది మాట్లాడి.. షో ఆఫ్ చేస్తున్నారని, ఆయన ఫ్యామిలీతో టూర్ కు వెళ్లినా ఫొటోలు పెడుతున్నారని.. ఇదంతా షో ఆఫ్ అన్నారు. రాయలసీమకు పౌరుషం లేదంటే ప్రజలు చెప్పుతో కొడతారని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు.
. డ్రైనేజ్ కాలువను చూసేందుకు వస్తే.. మా ఇంటి వద్దకు ఎందుకు వస్తారన్నప్పుడే నీ జ్ఞానం ఏంటో తెలిసిందన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
దమ్ముంటే డిబేట్ కు వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చర్చించాలని, ఎవరేం చేశారో ప్రజలకు కూడా తెలుస్తుందని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరెవరు ఎన్ని నీళ్లు తెచ్చారో డిబేట్ కు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV