గోవా మాదిరి ఫెస్టివల్! రేపటి నుంచి విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0
విశాఖపట్టం, 08 జనవరి (హి.స.) తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు సముద్ర సంబంధ వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 రేపటి నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలోని ఎంజీఎం
lighthouse-festival-30-in-visakhapatnam-from-tomorrow-512053


విశాఖపట్టం, 08 జనవరి (హి.స.)

తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు సముద్ర సంబంధ వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 రేపటి నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలోని ఎంజీఎం పార్క్ వేదికగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పోర్టులు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో లైట్ హౌస్ టూరిజం ప్రమోషన్, తీర ప్రాంత సంస్కృతి ప్రచారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. గతంలో గోవా, పూరిలలో నిర్వహించిన తరహాలోనే విశాఖలో కూడా ఈ వేడుకలను నిర్వహించేందుకు పోర్ట్, షిప్పింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ భరత్ పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande