సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్.. 12 నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
అమరావతి, 08 జనవరి (హి.స.) సంక్రాంతి పండుగ వస్తే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల యజమానులు ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్
బస్సులు


అమరావతి, 08 జనవరి (హి.స.)

సంక్రాంతి పండుగ వస్తే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల యజమానులు ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేయాలని బస్సుల యజమానులు నిర్ణయించారు.

ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెలు సరిపోవడం లేదని, తమకు నష్టాలు వస్తోన్న దృష్ట్యా అద్దెలను పెంచాలని బస్సు యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘాలు.. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. అద్దెలను పెంచే విషయంలో అనుకూల నిర్ణయం తీసుకోని క్రమంలో 12 నుంచి సమ్మెకు దిగనున్నట్లు వెల్లడించాయి. అదే జరిగితే.. ఈ సంక్రాంతి పండక్కి ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు. ఉన్న బస్సులకు అదనంగా వేలబస్సులను కేటాయించినా ప్రయాణికుల అవసరాలు తీరని క్రమంలో.. అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనుండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. 2025 నాటికి ఉన్న అధికారిక లెక్కల ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీ వద్ద 11,495 బస్సులు ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,716 ఉన్నాయి. అద్దె బస్సులు 2,779 ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సులు కాకుండా.. సంక్రాంతికి 8 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande