
అమరావతి, 09 జనవరి (హి.స.)
| అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ముందుగా ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుదిఫలితాలు వెల్లడించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
టెట్‌లో 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. ఈ పరీక్షకు 31,886 మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు హాజరుకాగా.. వారిలో 47.82 శాతం(15,239) మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. టెట్ పరీక్ష ఫలితాలను https://tet2dsc.apcfss.in, http://cse.ap.gov.in, 9552300009 వాట్సప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ