అమెరికాలో టూర్ కి.వెళ్లిన అద్దంకి విద్యార్ది అదృశ్యం
అమరావతి, 09 జనవరి (హి.స.) : అమెరికాలో టూర్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి ఆచూకీ లభించికపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హ్యూస్టన్‌లో నివసిస్తున్న హరి.. క్రిస్మస్‌ సెలవుల
అమెరికాలో టూర్ కి.వెళ్లిన అద్దంకి విద్యార్ది అదృశ్యం


అమరావతి, 09 జనవరి (హి.స.)

: అమెరికాలో టూర్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి ఆచూకీ లభించికపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

హ్యూస్టన్‌లో నివసిస్తున్న హరి.. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌ 22న పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లాడు. అక్కడ డెనాలి సమీపంలోని ఓ హోటల్‌లో బస చేసిన ఆయన.. జనవరి 3-4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు సమాచారం ఇచ్చాడు. డిసెంబర్‌ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాడు. 31న హోటల్‌ నుంచి బయటకు వెళ్లాడు.

అనంతరం ఓ క్యాబ్‌ సర్వీస్‌ వాడినట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి హరి ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోంది. హోటల్‌ నుంచి బయల్దేరిన హరి.. ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? డ్రైవర్‌ ఎవరు? అనే కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande