
న్యూఢిల్లీ, 09 జనవరి (హి.స.)ఖేలో ఇండియా పథకంలో భాగంగా కేంద్ర క్రీడా శాఖ రాష్ట్రానికి రూ.60.76 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ సెక్రటరీ ఓపీ చంచల్ గురువారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీకి లేఖ ద్వారా సమాచారం అందించారు. ఈ నిధులతో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, ఫుట్‌బాల్ మైదానం, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కుప్పంలోని జిల్లా స్టేడియంలో ఇండోర్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం,శ్రీకాకుళం జిల్లా ప్రాతుని వలసలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి ఈ నిధులు కేటాయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ