
తిరుమల, 09 జనవరి (హి.స.),:శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలో 400వ మెట్టు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా నేటి (శుక్రవారం) ఉదయం కొంత సేపు నడక మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపేశారు. ఆపై శ్రీవారి మెట్టు మార్గమంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారుల సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ