
హిందూపురం, 09 జనవరి (హి.స.)
పెనుకొండలో ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ ఏర్పాటు కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవి త తెలిపారు. రాజధానిలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఇస్కాన్‌కు స్థలం కేటాయించారని ఆమె తెలిపారు. రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పెనుకొండ(Penukonda)లోని ప్రఖ్యాతిగాంచిన ఘనగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ