తాడిపత్రి మండలంలోని తలారి చెరువు అదానీ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ ప్రాంతంలో. చిరుతపులి
అనంతపురం 09 జనవరి (హి.స.)తాడిపత్రి:మండలంలోని తలారిచెరువు అదానీ సిమెంట్‌ పరిశ్రమ మైనింగ్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి చిరుతపులి)కనిపించింది. భయబ్రాంతులకు గురైన సిమెంట్‌ పరిశ్రమ సిబ్బంది వెంటనే రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన సిబ్బంద
తాడిపత్రి మండలంలోని తలారి చెరువు అదానీ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ ప్రాంతంలో. చిరుతపులి


అనంతపురం 09 జనవరి (హి.స.)తాడిపత్రి:మండలంలోని తలారిచెరువు అదానీ సిమెంట్‌ పరిశ్రమ మైనింగ్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి చిరుతపులి)కనిపించింది. భయబ్రాంతులకు గురైన సిమెంట్‌ పరిశ్రమ సిబ్బంది వెంటనే రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన సిబ్బందితో కలిసి వెళ్లి మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు కూడా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ చిరుతపులి కనిపించలేదు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలైన ఊరుచింతల, తలారిచెరువు, ఉమ్మాయిపల్లి తదితర గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande