ముంబై మేయర్ పీఠం మరాఠా హిందువుదే..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
ముంబై మేయర్ పీఠం మరాఠా హిందువుదే..


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ముంబై, ,09, జనవరి (హి.స.)బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ అంటూ ఫడ్నవీస్ సమాధానం ఇచ్చారు. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే, ప్రజలు సహజంగా తమిళుడే మేయర్ కావాలని కోరుకుంటారు, ఇదే విధంగా ముంబైలో మరాఠీ వ్యక్తే అవుతారని అన్నారు.

జనవరి 15న జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ముఖ్యమంత్రి వ్యాఖ్య వచ్చింది. ఫడ్నవీస్ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని, ఇక్కడి మేయర్ హిందువు, మరాఠీ వారే అవతారని సీఎం స్పష్టం చేశారు. బీఎంసీతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande