
కరీంనగర్, 09 జనవరి (హి.స.)
ఉత్తర తెలంగాణ ప్రజలకు కేంద్ర
ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరీంనగర్లో 50 పడకల ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ ఆసుపత్రి మంజూరైంది. కగా, ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం ప్రాథమికంగా రూ.7.5 కోట్లను విడుదల చేసింది. 50 పడకల సామర్థ్యంతో నిర్మించే ఈ ఆసుపత్రిలో కాయ చికిత్సకు (20 పడకలు), పంచకర్మ (10), శల్య (10), ప్రసూతి, స్త్రీ రోగ చికిత్సల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు