
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి రాష్ట్ర
అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో భారీ ఊరట లభించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని దాఖలైన మధ్యంతర పిటిషన్పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్ ను వెల్లడించింది. కొట్టివేస్తున్నట్లుగా అదేవిధంగా కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇక పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను రాబోయే 4 వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం యూపీఎస్సీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు